మహబూబాబాద్: కలెక్టర్ కార్యాలయం ఎదుట BRS నాయ‌కుల‌ నిర‌స‌న‌లు

మహబూబాబాద్(CLiC2NEWS): అసెంబ్లీ వ‌ద్ద BRS నాయ‌కుల‌పై జ‌రిగిన దాడిని నిర‌సిస్తూ BRS పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. BRS ఎమ్మెల్యేలు, ఎమ్ఎల్సీల‌పై పోలీసుల దాడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయించిన దుర్మార్గం అని బిఆర్ ఎస్ నాయ‌కులు నిర‌స‌న‌లు చేస్తున్నారు. మ‌హిళా నాయ‌కుల‌ను సైతం అవ‌మాన‌కరంగా పోలీసుల దాడి చేయ‌డం అన్యాయ‌మ‌ని ఆరోపిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి వెళ్తున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్,మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారిని మరియు మహిళ MLA లను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకుని గాయపరిచి అరెస్ట్ చేసిన దానికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మాజి పార్ల‌మెంట్ స‌భ్యులు మాలోత్ క‌విత‌, మాజి మంత్రి స‌త్య‌వ‌తి రాతోడ్ జాతీయ రహదారి పైన రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకోలో వీరితో పాటు మాజీ MLA శంకర్ నాయక్ , మాజీ జెడ్పీ చైర్మన్ అంగోత్ బిందు, మహబూబాబాద్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.

Job News: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్టు నోటిఫికేష‌న్

 

Leave A Reply

Your email address will not be published.