రైల్వే రిక్రూట్మెంట్ బోర్టు నోటిఫికేషన్
జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల
RRB: మొత్తం పోస్టుల సంఖ్యం 4,029
జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీకి భారతీయ రైల్యే రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. దీనిలో సికింద్రాబాద్ జోన్లో 111 ఖాళీలున్నాయి. అర్హత , ఆసక్తికలిగిన అభ్యర్థులనుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది . దరఖాస్తు గడువు ఈ నెల 13వ తేదీతో ముగియనుంది.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఆర్ ఆర్ బిలు, రైల్యే జోన్లు/ ప్రొడక్షన్ యూనిట్లలో కలిపి మొత్తం 4 వేల పోస్టులున్నాయి.
జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) 3,994.
కెమికల్ & మెటలార్జికల్ అసిస్టెంట్ (CMA) 35 పోస్టులు కలవు.
వయస్సు 1.1.2027 నాటికి 18 నుండి 33 సంవత్సాల వయస్సు ఉండాలి.
ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్ , మెకానికల్, ఎస్ అండ్ టి, స్టోర్ విభాగాల్లో పోస్టులు కలవు.
అర్హత పోస్టును బట్టి సంబంధిత విబాగాల్లో డిప్లొమా/ ఇంజినీరింగ్, బిఎస్సి ఉత్తీర్ణత ఉండాలి.
ప్రారంభ వేతనం నెలకు రూ. 35,400
ఎంపిక విధానం : స్టేజ్-1, స్టేజ్ -2 కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు ఉంటాయి. సర్టిఫికెట్ల పరిశీలన, రైల్వే మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
ఆర్ ఆర్బి రీజియన్లు: అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, సికింద్రాబాద్, చెన్నై, చండీగఢ్ భువనేశ్వర్, భోపాల్, ముంబయి, బిలాస్పూర్, గువామటి, గోరఖ్‌పూర్ జమ్ము& శ్రీనగర్, కోల్ కతా, మాల్దా, పట్నా, ప్రయాగరాజ్, యుజఫర్పూర్, రాంచీ, సిలిగురి,ర తిరువనంతపురం.
పరీక్ష విధానం:
స్టేజ్ -1 కంప్యూటర్ బేసెడ్ టెస్ట్‌లో 100 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. 100 మార్కలు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
స్టేజ్ -11 కంప్యూటర్ బేసెడ్ టెస్ట్‌లో 150 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. 150 మార్కలు. పరీక్ష సమయం 120 నిమిషాలు ఉంటుంది.
ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగెటివ్ మార్కు ఉంటుంది. అందుకని అభ్యర్థులు సమాధానాలను సరిగ్గా పెట్టవలసి ఉంటుంది. తెలియనివి వదిలేస్తేనే మంచిది.
స్టేజ్ -1లో
గణితం- 30 ప్రశ్నలు
జనరల్ ఇంటిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు
జనరల్ అవేర్నెస్ 15 ప్రశ్నలు
జనరల్ సైన్స్ 30 ప్రశ్నలు ఉంటాయి.
స్టేజ్- 11 లో
జనరల్ అవేర్నెస్ 15 ప్రశ్నలు
ఫిజిక్స్ & కెమిస్ట్రి 15 ప్రశ్నలు
కంప్యూటర్ బేసిక్ & అప్లికేషన్స్ 10 ప్రశ్నలు
బేసిక్ ఆప్ ఎన్నిరాన్‌మెంట్ & పొల్యూషన్ కంట్రోల్ 10 ప్రశ్నలు
టెక్నికల్ ఎబిలిటీస్ లో 100 ప్రశ్నలు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
Also Read: అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత..