అసెంబ్లీ గేటు వ‌ద్ద ఉద్రిక్త‌త‌..

టీష‌ర్టుల‌తో అసెంబ్లీకి రాకూడ‌దా..?: హ‌రీశ్‌రావు

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అసెంబ్లీ ఎదుట ఉద్రిక్త‌త వాతావ‌రణం నెల‌కొంది. బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను పోలీసులు అడ్డుకున్నారు. బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు రాసిఉన్న న‌ల్ల టిష‌ర్టులు ధ‌రించి అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి ప్ర‌వేశించేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బిఆర్ ఎస్ స‌భ్యులను అసెంబ్లీలోకి రాకుండా చేయాల‌ని ప్ర‌భుత్వం ఇలాంటి చ‌ర్య‌లకు పాల్ప‌డుతోంద‌ని హ‌రీశ్‌రావు ఆరోపించారు. ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్షం లేకుండా చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని చూస్తున్న‌ట్లు ఆయ‌న మండిప‌డ్డారు.

స‌మావేశాల‌కు ముందు బిఆర్ ఎస్ స‌భ్యులు గ‌న్‌పార్క్ వ‌ద్ద న‌ల్ల టిష‌ర్టులు ధ‌రించి ప్ల‌కార్డులు ప‌ట్టుకుని నిర‌స‌న తెలిపారు. మాజి మంత్రి కెటిఆర్ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు చేశారు.కాంగ్రెస్ స‌ర్కార్ ఇచ్చిన హాహీలు అమ‌లు కోసం గ‌ట్టిగా పోరాడ‌తామ‌న్నారు. 100 రోజుల్లో చేస్తాన‌న్న రుణ‌మాఫీ ఎందుకు పూర్తి చేయ‌లేద‌ని.. మ‌హిళ‌ల‌కు రూ.2500 హామీ ఎప్పుడు అమ‌లు చేస్తార‌ని ప్ర‌శ్నించారు.

టిష‌ర్టులు ధ‌రించి అసెంబ్లీ ప్రాంగ‌ణంలోకి వ‌స్తుండ‌గా  అడ్డుకోవ‌డంతో హ‌రీశ్‌రావు, ప‌లువురు ఎమ్మెల్యేలు టిష‌ర్టులు విప్పి .. బ‌నియ‌న్ల‌తో అక్క‌డే నిర‌స‌న తెల‌పారు. పోలీసులు బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదంలో కెటిఆర్‌కు గాయాల‌య్యాయి. బిఆర్ ఎస్ మ‌హిళా ఎమ్మెల్యే స‌బిత ఇంద్రా రెడ్డి, సునీతా ల‌క్ష్మారెడ్డి సైతం పాల్గొన్నారు. పోలీసులు త‌న ప‌ట్ల ఆమానుషంగా ప్ర‌వ‌ర్తించార‌ని సునీతా ల‌క్ష్మారెడ్డి క‌న్నీటిప‌ర్యంత‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ టిష‌ర్టులు ధ‌రించి పార్ల‌మెంట్ కు వెళితే ప‌ర్యాలేదుకానీ.. మేం అసెంబ్లీకి వెళ్ల‌కూడదా.. అని ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వ హామీలు అమ‌లు చేయాల‌ని టీష‌ర్టుల‌పై ఉంది. నిర‌స‌న‌లు తెలిపే హ‌క్కు కూడా మాకు లేదా అని హ‌రీశ్ రావు ప్ర‌శ్నించారు.

మ‌రోవైపు స్పీక‌ర్ సూచ‌న‌ల మేరకే పోలీసులు వ్య‌వ‌హ‌రించార‌ని.. ఖైర‌తాబాద్ జోన్ డిసిపి తెలిపారు. బ్లాక్ టీష‌ర్టులు వేసుకోవ‌డం నేరం కాదు కానీ వాటిపై రాసిఉన్న అభ్యంత‌ర‌క‌ల ప‌దాల కార‌ణంగా బిఆర్ ఎస్ ఎమ్మెల్యేల‌ను అడ్డుకున్న‌ట్లు తెలిపారు. వారితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేద‌న్నారు. అసెంబ్లీ ఎదుట జ‌రిగ‌న ఘ‌ట‌న‌ను అక్క‌డ ఉన్న వీడియోల‌ను ప‌రిశీలిస్తామ‌న్నారు.

కాంగ్రెస్ స‌ర్కార్ 1000 రోజుల పాల‌న‌లోని వైఫ‌ల్యాల‌ను నిర‌సిస్తూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వ‌చ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవ‌డంతో ఏర్ప‌డిన ఉద్రిక్త‌ల కార‌ణంగా పోలీసులు ప‌లువురు బిఆర్ ఎస్ నాయ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ తీరుపై మండిప‌డిన బిఆర్ ఎస్ పార్టీ.. రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది.

Educational News: ఇంజినీరింగ్ చ‌దివే బాలిక‌ల‌కు రూ. 50వేల‌ స్కాల‌ర్‌షిప్ పొందే అవ‌కాశం..

Leave A Reply

Your email address will not be published.