మద్యం సేవించి వాహనాలు నడిపిన డ్రైవర్లకు జరిమానా..
24 మంది డ్రైవర్లకు రూ.40,500/- జరిమానా
రామగుండం పోలీస్ కమిషనరేట్ (CLiC2NEWS): రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్, మంచిర్యాల పట్టణ ట్రాఫిక్ పోలీసులు.. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన డ్రైవర్లపై కేసులు నమోదు చేసి, వారిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.
ఈ కేసులను విచారించిన న్యాయస్థానం 24 మంది డ్రైవర్లకు కలిపి మొత్తం రూ.40,500/- జరిమానా విధించింది.
ఈ సందర్భంగా మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ హన్నన్ మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడపడం ద్వారా వాహనం నడిపే వ్యక్తితో పాటు రహదారిపై ప్రయాణించే ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా తీవ్ర ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఇకముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంచిర్యాల: నంబర్ ప్లేట్లు లేని వాహనాలు సీజ్