ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 179 కేసులు: నలుగురు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. ఎపిలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 885616కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2338 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 876140 మంది కోలుకున్నారు. కరోనాతో గురువారం వరకు 7138 మంది మరణించారు.
