ప్ర‌ధాని, సిఎంల‌కు రెండో ద‌శ‌లో టీకా!

న్యూఢిల్లీ: రెండో ద‌శ వ్యాక్సినేష‌న్‌ డ్రైవ్‌లో భాగంగా ప్ర‌ధాని మోదీ న‌రేంద్ర మోడీ క‌రోనా టీకా వేయించుకోనున్నారు. ఆయ‌న‌తో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు రెండో దశ‌లో కోవిడ్ టీకా తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల ముఖ్య‌మంత్రుల‌తో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ప్ర‌ధాని మోదీ.. రాజ‌కీయ‌వేత్త‌లతో పాటు 50 ఏళ్లు దాటిన వారు రెండ‌వ రౌండ్‌లో టీకా తీసుకోవాల‌న్న సూచ‌న చేశారు. జ‌న‌వ‌రి 16 నుంచి తొలి ద‌శ‌లో కేవ‌లం ఫ్రంట్‌లైన్‌, హెల్త్ వ‌ర్క‌ర్ల‌కు మాత్ర‌మే టీకా వేస్తున్న విష‌యం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. బుధ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుమారు 7.86 ల‌క్ష‌ల హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు టీకాలు వేసుకున్న‌ట్లు కేంద్రం పేర్కొన్న‌ది. బుధ‌వారం 20 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1,12,007 మందికి టీకాలు వేసిన‌ట్లు తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.