నేటినుంచి ప్రైవేట్‌ వైద్యసిబ్బందికి క‌రోనా వ్యాక్సిన్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో నేటి (సోమవారం) నుంచి ప్రైవేట్‌ హాస్పిటళ్ల వైద్యసిబ్బందికి కరోనా వాక్సిన్‌ వేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ దవాఖానల సిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లకు వ్యాక్సినేషన్‌ దాదాపు పూర్తయింది. ఇక ప్రైవేట్‌ల్లోని 1.54 లక్షల మంది వైద్యసిబ్బందికి టీకా వేయాలని ఈ మేర‌కు స‌ర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలోని రెవెన్యూ సిబ్బందికి కూడా టీకాలు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Leave A Reply

Your email address will not be published.