ఆర్ట్స్ కాలేజీ మరమ్మతులకు రూ.3 కోట్లు
హైదరాబాద్: ఒయు ఆర్ట్స్ కాలేజీ మరమ్మతుల కోసం హెచ్ఎండీఏ రూ.3 కోట్లు విడుదల చేయనుందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఓయూ ఇన్చార్జీ వీసీ అరవింద్ కుమార్ ప్రకటించారు. 72వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వర్సిటీ అధికారులతో కలిసి అరవింద్ కుమార్ మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ భవనం వద్ద జాతీయజెండాను ఆవిష్కరించారు. దీనిపై ఒయు రిజిస్ట్రార్ ప్రొ. సీహెచ్ గోపాల్‌రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొ. టి. కృష్ణారావు, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొ. డి. రవీందర్, సిబ్బంది, విద్యార్థులు అరవింద్ కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.