ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్తగా 111 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేర‌కు బుధ‌వారం సాయంత్రం ఎపి వైద్యాఆరోగ్య‌శాఖ బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా వైరస్‌ బారినపడిన వారిలో 97మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,87,349 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,78,828 మంది చికిత్సకు కోలుకున్నారు. మరో 1369 మంది దవాఖాన, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ బారిన‌ప‌డి 7152 మంది మృత్యువాతపడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Leave A Reply

Your email address will not be published.