రైతులకిచ్చిన ఆఫ‌ర్ ఇప్ప‌టికి ఉంది: ప‌్ర‌ధాని మోడీ

న్యూఢిల్లీ: రైతుల‌తో చ‌ర్చ‌ల‌కు మేం ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాం.. చ‌ర్చ‌ల‌తోనే స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మేడీ వెల్ల‌డించారు. బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో శ‌నివారం అఖిల ప‌క్ష స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో మోడీ రైతుల రైతు నిర‌స‌న‌ల గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వివాదాస్ప‌ద‌మైన మూడు కొత్త సాగు చ‌ట్టాల‌ను ఏడాదిన్న‌ర పాటు నిలిపివేత‌కు స‌ర్కార్ సిద్దంగా ఉంది అని తెలిపారు. ఇంకా అంశం ఇంకా స‌జీవంగానే ఉన్న‌ట్లు మోదీ వెల్ల‌డించారు. అన్ని అంశాల‌పై రైతుల‌తో చ‌ర్చించేందుకు త‌మ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని ప్ర‌ధాని తెలిపారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్‌తో రైతులు చ‌ర్చించార‌ని, అయితే కొత్త చ‌ట్టాల స‌స్పెన్ష‌న్‌పై ఎటువంటి ఒప్పందం జ‌ర‌గ‌లేద‌ని, కానీ రైతుల‌తో ఆ ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు మంత్రి త‌నతో చెప్పార‌ని అఖిల ప‌క్ష భేటీలో ప్ర‌ధాని వెల్ల‌డించారు. కాగా రానున్న బ‌డ్జెట్‌లో రైతుల‌కు వ‌రాలు ప్ర‌క‌టిస్తాం అని ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.