ఏప్రిల్ 9న ‘వకీల్‌ సాబ్‌’ డేట్ ఫిక్స్‌

ప‌వ‌ర్‌స్టార్ సినిమా అంటే ఫ్యాన్స్‌కు పండ‌గే.. అందులోనూ చ‌లా గ్యాప్ త‌ర్వాత వ‌స్తున్న సినిమా అవ‌డంతో అభిమానులు అప్‌డేట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ క్ర‌మంలో అభిమానుల‌కు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా వకీల్‌సాబ్‌ మూవీ నుంచి మరో అప్డేట్‌ వచ్చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తి అయింది. దిల్ రాజు నిర్మాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో శృతిహాసన్‌, అంజలి, నివేథా థామస్‌, అనన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హిందీ మూవీ పింక్‌కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ఆ టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అయితే.. తాజాగా వకీల్‌సాబ్‌ మూవీ నుంచి మరో అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా? అని ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చిత్రయూనిట్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పేసింది. చిత్ర విడుదల తేదీని శనివారం అధికారికంగా చిత్రయూనిట్‌ ప్రకటించింది. ఈ చిత్రం ఏప్రియల్‌ 9వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోన్నట్లుగా చెబుతూ.. చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ చిత్రానికి సంబంధించి సంక్రాంతి కానుకగా విడుదలైన టీజర్‌ ఎటువంటి స్పందనను రాబట్టుకుందో అందరికీ తెలిసిందే. పవన్‌ను లాయర్‌ కోటులో చూపించడమే కాకుండా ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌తో టీజర్‌ను వదిలారు. టీజర్‌ ఆకట్టుకోవడమే కాకుండా.. సినిమా కోసం వెయిటింగ్‌ అనేలా చేయడంలో సక్సెస్‌ అయింది. దీంతో ఎప్పుడెప్పుడు రిలీజ్‌ అవుతుందా అని అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. వేసవికి ట్రీట్‌ అన్నట్లుగా చిత్రయూనిట్‌ విడుదల తేదీ ప్రకటించడంతో.. ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో రచ్చ స్టార్ట్ చేశారు. ఈ అప్టేట్‌తో పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ పండగా చేసుకుంటున్నారు. కాగా ఈ సినిమా తర్వాత పవన్‌ మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే.

 

Leave A Reply

Your email address will not be published.