తెలంగాణలో కొత్తగా 118 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో మరో ఇద్దరు మృతి చెందారు. ఈ మేరకు సోమవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,94,587కి చేరింది. తాజాగా మృతి చెందిన ఇద్దరితో కలిపి రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 1601కి చేరింది. కరోనా బారి నుంచి ఒక్క రోజులో 264 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,092 ఉండగా..వీరిలో 723 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని అధికారులు పేర్కొన్నారు.