ఏపీ ఇంటర్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

అమరావతి: ఎపిలో ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్ విడుద‌లైంది. మే 5వ తేదీ నుంచి పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేస్తూ ఇంటర్మీడియట్‌ బోర్డు సోమవారం ఓ ప్రకటన వెలువరించింది. మే 5 నుంచి 23 వరకు ఇంటర్మీడియల్‌ పరీక్షలు జరుగుతాయి. వాటిలో 5 నుంచి 22 వరకు ఫస్టియర్‌ విద్యార్థులు, మే 6 నుంచి 23 వరకు సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అయితే అంతకుముందే మార్చి 31 నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇంటర్మీడియట్‌ బోర్డు షెడ్యూల్‌ ప్రకటించింది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

మొద‌టి సంవ‌త్స‌రం షెడ్యూల్ ఇదే…

  1. 05-05-2021: సెకండ్ లాంగ్వేజ్
  2. 07-05-2021: ఇంగ్లీష్ పేపర్ -1
  3. 10-05-2021: మ్యాథ్స్ పేపర్ 1ఏ, బోటనీ పేపర్-1, సివిక్స్ పేపర్ 1
  4. 12-05-2021: మ్యాథ్స్ పేపర్ 1బీ, జూలాజీ పేపర్ 1, హిస్టరీ పేపర్ 1
  5. 15-05-2021: ఫిజిక్స్ పేపర్ 1, ఎకనామిక్స్ పేపర్ 1
  6. 18-05-2021: కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 1
  7. 20-05-2021: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1, లాజిక్ పేపర్ 1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 1
  8. 22-05-2021: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 1, జియోగ్రఫీ పేపర్ 1

రెండ‌వ సంవ‌త్స‌రం షెడ్యూల్ ఇదే…

  1. 06-05-2021 : సెకండ్ లాంగ్వేజ్ – పేపర్ 2
  2. 08-05-2021: ఇంగ్లీష్ పేపర్ -2
  3. 11-05-2021: మ్యాథ్స్ పేపర్ 2ఏ, బోటనీ పేపర్ 2, సివిక్స్ పేపర్ 2
  4. 13-05-2021: మ్యాథ్స్ పేపర్ 2బీ, జూలాజీ పేపర్ 2, హిస్టరీ పేపర్ 2
  5. 17-05-2021: ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2
  6. 19-05-2021: కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్ 2
  7. 21-05-2021: పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 2, లాజిక్ పేపర్ 2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్ 2
  8. 23-05-2021: మోడరన్ లాంగ్వేజ్ పేపర్ 2, జియోగ్రఫీ పేపర్ 2
Leave A Reply

Your email address will not be published.