బెంగాల్ మంత్రిపై బాంబుదాడి
కోల్‌కతా: బెంగాల్‌లో రాజకీయ వేడి రాజుకుంటోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు, బిజెపికి మధ్య మాటల వార్ నడుస్తోంది. ఒకవైపు తృణమూల్ నాయకులు బిజెపిలో చేరుతున్నారు. తాజాగా బెంగాల్ కార్మికశాఖా మంత్రి జాకిర్ హుస్సేన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. ముర్షీదాబాద్ జిల్లాలోని రంగనాథ్ గంజ్ రైల్వే స్టేషన్ లో రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ పై నిలబడి ఉండగా ఆయనపై దాడి జరిగింది. ఈ దాడి జరిగిన వెంటనే ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు బెంగాల్ బిజెపి అధ్యక్షుడు శివాజీ సింగ్ రాయ్, సుబెందు అధికారి, శంకుదేవ్ పాండాలపై కొందరు దుండగులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. బెంగాల్ లో బీజేపీ నేతలపై దాడులు జరుగుతుండటంతో హుటాహుటిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అర్ధరాత్రి కోల్ కతా కు వెళ్లారు. ఈ దాడుల నేపథ్యంలో స్థానికంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.