పదోరోజు పెరిగిన పెట్రోల్‌ ధర

న్యూఢిల్లీ : గ‌త ప‌ది రోజులుగా పెట్రో ధరల పెంపు కొనసాగుతోంది. తాజాగా గురువారం సైతం చమురు కంపెనీలు ధరలను పెంచాయి. ఈ ఏడాదిలో పెట్రోల్‌ ధర రూ.6పైగా పెరగ్గా.. ఈ నెలలో ధరలు పెరగడం 12వసారి. తాజాగా మరో లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, లీటర్‌ డీజిల్‌పై 34 పైసల వరకూ పెంచాయి. దీంతో ఢిల్లీలో ధర రూ.90కి చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్‌ లీటర్‌ రూ.89.88కు చేరింది. రికార్డు స్థాయిలో డీజిల్‌ సైతం రూ.80ని దాటింది. గురువారం 32 పైసలు పెరిగి లీటర్‌కు రూ.80.27కు చేరింది. ముంబ‌యిలో పెట్రోల్ రూ.96.32కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్ ఈ రోజు లీటరుకు రూ.91.11, చెన్నైలో రూ .91.98కు చేరింది. అలాగే హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర రూ.93.45, డీజిల్‌ రూ.87.55కు చేరింది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్‌లో లీటర్‌కు రూ.100కిపైగా చేరింది. పెట్రోల్‌ ధరల పెరుగుదలతో సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.