`ఉప్పెన`పై మహేష్ ప్ర‌శంస‌లు

ఈ ఏడాది సినీ పెద్ద‌ల అంద‌రితోనూ ప్ర‌శంస‌లు అందుకొంటున్న సినిమా `ఉప్పెన‌`. ఇంత‌ అద్భుత చిత్రంగా మ‌లిచింది డ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సనా. కాగా తాజాగా ఈ సినిమాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు ట్వీటర్ వేదికగా ప్ర‌శంస‌లు కురిపించారు. అద్భుత‌మైన క్లాసిక్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారని మహేస్ అన్నారు.

‘ఉప్పెన సినిమాను ఒక్క పదంలో చెప్పాలంటే క్లాసిక్. ఇండస్ట్రీకి బుచ్చిబాబు ఎంతో అరుదైన సినిమాను తీసుకొచ్చారు. ఇది చెప్పడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమాలో సంగీతం సినిమా కథతో పోటీ పడే విధంగా ఉంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవీ శ్రీ ప్రసాద్ మరో సారి తన ప్రతిభను చూపించారు. ఇక కొత్త‌వారైనా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి అద్భుతంగా న‌టించారు… తమ తొలి సినిమాలోనే ఎంతో గొప్పగా నటించారు. ఇటువంటి సినిమాను నిర్మించినందుకు మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ గారికి హ్యాట్స్ ఆఫ్’ అంటూ మహేష్ ట్వీట్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.