వాణీదేవీ అర్హతలు దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలి : మంత్రి కెటిఆర్
హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవి అర్హతలు దృష్టిలో పెట్టుకొని పట్టభద్రులు ఓటు వేయాలని ఐటి మంత్రి కెటిఆర్ కోరారు. తెలంగాణ భవన్‌లో బుధవారం మూడు జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవిని పోటీలో నిలిపినట్లు పేర్కొన్నారు. ‘పీవీ కుమార్తె అయినా ఏనాడూ వాణీదేవిలో ఆ గర్వం కనిపించలేదని మంత్రి అన్నారు. అలాగే న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు కేటాయించి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేశాం. స్వతహాగా లాయరైన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలి.` అని కేటీఆర్ నిలదీశారు.