ట్రక్కు బోల్తాపడి ఆరుగురు దుర్మరణం
కాన్పూర్: యూపిలోని కాన్పూర్లో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో ట్రక్కు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాన్నూర్ దగ్గరలోని భోగానిపూర్ కొత్వాలి ప్రాంతంలోని మౌఖాస్ గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా కూలీలని తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తిలియాల్సి ఉంది.