టీకా తీసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఢిల్లీలోని ఆర్ఆర్ హాస్పిటల్‌లో తొలి డోసు టీకాను వేయించుకున్నారు. కాగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 60 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా టీకాలు ఇస్తున్నారు. 45 ఏళ్లు దాటి.. వ్యాధులు ఉన్నవారికి కూడా ప్రభుత్వ దవాఖానాల్లో ఉచిత టీకాలను ఇస్తున్నారు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు కోవిడ్ టీకాను తీసుకున్నారు. అలాగే ఆయా రాష్ట్రాలు సీఎంలు, మంత్రులు కూడా టీకాలు వేయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్ తదితరులు టీకా వేయించుకున్నారు.
President Ram Nath Kovind, accompanied by his daughter, was administered the COVID-19 vaccine at the Army R&R Hospital, Delhi, today. pic.twitter.com/xf6VQ6pIwS
— President of India (@rashtrapatibhvn) March 3, 2021