ఒకే ఓవర్లో 6 సిక్సర్లు: పొలార్డ్ బ్యాటింగ్ వీడియో..
ఆంటిగ్వా: వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ ఏకంగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. శ్రీలంక బౌలర్ అకిల ధనంజయ ఒక్క ఓవర్ తేడాతో హీరో నుంచి జీరో అయిపోయాడు. ఆ బౌలర్ అంతకుముందే హ్యాట్రిక్ తీసిన ఊపులో ఉన్నాడు. అలాంటి బౌలర్‌ను చితకబాదాడు. 132 పరుగుల లక్ష్యంతో బరిలోకి విండీస్ 3.1 ఓవర్లో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసి మెరుపు ఆరంభాన్ని అందుకుంది. ఈ సమయంలో బౌలింగ్‌కు దిగిన ధనంజయ వరుస బంతుల్లో ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్‌ను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాతి ఓవర్లోనే పొలార్డ్ అతను వేసిన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్ పొలార్డ్.
- ఫస్ట్ బ్యాట్స్‌మన్: నెదర్లాండ్స్‌పై గిబ్స్ తొలిసారి ఈ ఘనత సాధించాడు.
- సెకండ్ బ్యాట్స్‌మన్: యువరాజ్ బ్రాడ్ బౌలింగ్‌లోనూ ఆరు సిక్సర్లు (2007 వరల్డ్‌కప్)
- మూడో బ్యాట్స్‌మన్: శ్రీలంకపై ఇప్పడు పొలార్డ్
Pollard’s 6*6
How lucky are we to have @irbishi in the comm box 🔥#WivSL #SLvWi #Pollard #KieronPollard https://t.co/BhdliaYRap pic.twitter.com/1jmLXIHiwD
— AlreadyGotBanned 😄 (@KirketVideoss) March 4, 2021