రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30
న్యూఢిల్లీ: ఇప్పటి వరకూ రూ.10గా ఉన్న ప్లాట్‌ఫామ్ టికెట్‌ను భారతీయ రైల్వేస్ రూ.30కి పెంచింది. అదికే వలం రెండు గంటల పాటు ప్లాట్‌ఫామ్‌పై ఉండటానికి ఇంత భారీ మొత్తం వెచ్చించాలి. అలాగే లోకల్ రైళ్ల టికెట్లను కూడా భారీగా పెంచింది ఇండియన్ రైల్వేస్. లోకల్ రైళ్లలో ఇక నుంచి కనీస ఛార్జీ రూ.30గా నిర్ణయించారు. కరోనా మహమ్మారి సమయంలో అనవసర ప్రయాణాలను ప్రోత్సహించకూడదన్న ఉద్దేశంతోనే ఛార్జీలను పెంచినట్లు ఇండియన్ రైల్వేస్ తెలిపింది. అలాగే ప్లాట్‌ఫామ్‌పై అవసరం లేకున్నా ఉండటం.. ఎక్కువ మంది గుమిగూడకుండా చూడటం కోసమే తాత్కాలికంగా ఈ ధరలు పెంచినట్లు అధికారులు తెలిపారు.