రూ.43వేల దిగువకు బంగారం
న్యూఢిల్లీ: పసిడి ప్రియులకు శుభవార్త. దేశంలో బంగారం ధరలు తగ్గాయి. ఇది నిజమేనండి. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.522 తగ్గి రూ.43,887కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,409 వద్ద ముగిసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పెట్టుబడులకు మదుపర్లు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఇవాళ బంగారం ధరలు దిగి వచ్చాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. అలాగే వెండి ధరలు కూడా ఇవాళ భారీగానే దిగొచ్చాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,822 తగ్గి రూ.64,805కు చేరింది.