జనసేన తరపున చింతమనేని ప్రచారం..
ఏలూరు: ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొర్పొరేషన్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విత్డ్రా చేసుకున్న డివిజన్లలో పోటీలో ఉన్న బిజెపి, జనసేన పార్టీలకు చెందిన అభ్యర్థులకు వారి తరఫున ప్రచారం చేస్తానని టిడిపి మాజీ ఎమ్మెల్యే చింమనేని ప్రభాకర్ అన్నారు. ఏలూరు కార్పొరేషన్ లో 25 వ డివిజన్ లో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి తరపున టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రచారం నిర్వహించారు. టీడీపీ అభ్యర్థులు లేని డివిజన్ లలో మాత్రమే జనసేన కోసం ప్రచారం నిర్వహిస్తామని ఆయన అన్నారు. అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసి 25 వ డివిజన్ ను ఏకగ్రీవం చేయాలని టీడీపీ అభ్యర్థిని విత్ డ్రా చేయించారని అందుకే కావున 25 డివిజన్ లో జనసేన అభ్యర్థి కి ప్రచారం చేస్తున్నామని చింతమనేని అన్నారు.