పరుగుల వీరునికి ఘనస్వాగతం..
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న మాస్టర్ సెహ్వాగ్ రాథోడ్ కేరళ రాష్ట్రం కాలికట్ లో జరిగిన సౌత్ జోన్ అథ్లెటిక్ 300 మీటర్ల జాతీయ స్థాయి పరుగు పందెం పోటీలో గోల్డ్ మెడల్ సాధించి పాఠశాలకి తిరిగివచ్చిన సందర్భంలో ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు మాస్టర్ సేవాగ్ రాథోడ్ నీ మేళతాళాలతో, డప్పుల దరువులతో సాదరంగా పాఠశాలలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానం అనంతరం మాస్టర్ సేవాగ్ కృషి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచే విధంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పాఠశాల/ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ జి. మహేందర్ మాట్లాడుతూ తన విజయంతో ఎల్లారెడ్డి పాఠశాలకి, ఎల్లారెడ్డి పట్టణానికి జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చిన మాస్టర్ సేవాగ్ కృషిని, అతని కృషి వెనుక దాగి ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుడు బి. లింగంను ప్రశంసించారు. ఈ సన్మాన కార్యక్రమంలో పాఠశాల/ కళాశాల సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ శ్రీ ఎన్. రాజేశ్వర్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బి.నవీన్ మరియు పాఠశాల/ కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.