వేలాల గోదావరిలో యువకుడు గల్లంతు
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల సమీపంలోని గోదావరి నదిలో యువకుడు గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మహాశివరాత్రి సందర్భంగా సోంగూడెం గ్రామనికి చెందిన శ్రీనివాస్ (30) అనే యువకుడు శనివారం వేలాల జాతరకు వచ్చాడు. సమీపంలో గోదావరిలో స్నానం కోసం ఇవాళ (శనివారం) ఉదయం నీటిలోకి దిగాడు. నీటి ప్రవాహం, లోతు అధికంగా ఉండడంతో నదిలోకి దిగిన శ్రీనిసవాస్ గల్లంతయ్యారు. సమాచారమందుకున్న అధికారులు యువకునికోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
