ఎపిలో కొత్తగా 175 పాజిటివ్ కేసులు
అమరావతి: ఎపిలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 175 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనాతో కొత్తగా అనంతపూర్ ఒకరు, చిత్తూర్‌లో ఒకరు మరణించారు. తాజా మరణాలతో కలిపి కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7182కు చేరింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 891563కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1268 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 883113 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారని అధికారులు పేర్కొన్నారు.
