దేశంలో మళ్లీ 25 వేలు దాటిన క‌రోనా కొత్త కేసులు

న్యూఢిల్లీ: భారత్‌లో మ‌ళ్లీ కరోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 25,320 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం బులిటెన్ వెడుద‌ల చేసింది. తాజా కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,13,59,048కు చేరింది. తాజాగా 16,637 మంది వైరస్‌ నుంచి డిశ్చార్జి అయ్యారు. కాగా ఇప్పటి వరకు 1,09,89,897 మంది కోలుకున్నారని బులిటెన్‌లో తెలిపింది. తాజాగా మరో 161 మంది మృత్యువాత పడ్డారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 1,58,607కు చేరింది. ప్రస్తుతం దేశంలో 2,10,544 యాక్టివ్‌ కేసులున్నాయని అధికారులు వెల్ల‌డించారు. ఓ వైపు దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కొన‌సాగుతున్నా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టక‌పోవ‌డం ఆందోళన కలిగిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.