RRR.. `సీత` ఫస్ట్ లుక్ విడుదల
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియాభట్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న చిత్రం `RRR` దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో రామ్‌చరణ్ కు జోడీగా ఆలియా కనిపించనున్నారు. శుక్రవారం ఆలియా పుట్టిన రోజు సందర్భంగా RRR` నుంచి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం ఈ లుక్ ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తోంది.
సీతగా అలియా లుక్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చిత్రంలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, ఇంటర్నేషనల్ స్టార్స్ రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, ఒలీవియా మోరిస్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే సౌత్ స్టార్ సముద్రఖని, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కె.కె.సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్ ప్రధాన పాత్రలలో జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అక్టోబర్ 13న మూవీని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు.
