3 వాహనాలు ఢీ: ఇద్దరు మృతి
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. పోలీసుల కథనం ప్రకారం.. మోదుగుపాలేనికి చెందిన కూలీలు వెళ్తున్న ఆటోను తొలుత టిప్పర్ ఢీకొట్టింది. అది వెళ్లి మరో కారును తాకింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని హాస్పిటల్కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎనిమిది మంది వరకు కూలీలు ఉన్నారని, పనుల కోసం వెళ్తున్న క్రమంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.