మంచిర్యాల గర్ల్స్ హైస్కూల్లో కరోనా కలకలం
మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలిక పాఠశాలలో కరోనా కలకలం రేగింది. ప్రభుత్వ పాఠశాలలో 14 మందికి కరోనా సోకింది. సోమవారం రోజున కొంతమంది టీచర్లు, విద్యార్థులకు టెస్టులు నిర్వహించారు. ఇందులో 11 మంది టీచర్లకు, ఇద్దరు వంట వంటవాళ్ళకు, ఒక విద్యార్థికి కరోనా సోకింది. దీంతో విద్యాశాఖ అప్రమత్తం అయ్యింది. పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థినిలకు కూడా ఈరోజు టెస్టులు నిర్వహించనున్నారు.