189 పోస్టుల భర్తీకి ఇఎస్ఐసి సనత్‌నగర్ మెడికల్ కాలేజీ నోటిఫికేషన్
హైదరాబాద్ : హైదరాబాద్: బోధనా ఆసుపత్రిలో అధ్యాపకులు, క్లినికల్ పోస్టుల కోసం 189 పోస్టులను నియమించాలని సనత్‌నగర్‌లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) మెడికల్ కాలేజీ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ఫ్యాకల్టీ, సీనియర్ కన్సల్టెంట్ (సూపర్ స్పెషాలిటీ), ఎంట్రీ లెవల్ జూనియర్ కన్సల్టెంట్స్ / సూపర్ స్పెషలిస్ట్స్, బ్రాడ్ స్పెషాలిటీ కన్సల్టెంట్, సీనియర్ రెసిడెంట్స్, సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్, జూనియర్ రెసిడెంట్స్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
పోస్టుల వివరాలు..
- టీచింగ్ ఫ్యాకల్టీకి సంబంధించి ప్రొఫెసర్స్ -11
- అసోసియేట్ ప్రొఫెసర్స్ -25
- అసిస్టెంట్ ప్రొఫెసర్స్ – 11
- సీనియర్ కన్సల్టెంట్ -7
- ఎంట్రీ లెవల్ జూనియర్ కన్సల్టెంట్- 17
- అర్హులైన వైద్యుల నుండి స్పెషాలిటీ స్పెషలిస్ట్స్(జూనియర్ స్కేల్) -5
- కన్సల్టెంట్(బ్రాడ్ స్పెషాలిటీ) -8
- సీనియర్ రెసిడెంట్స్ -80
- సీనియర్ రెసిడెంట్ (బ్రాడ్ స్పెషాలిటీ) -16
- సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ -1
- జూనియర్ రెసిడెంట్స్ -3
- జూనియర్ రెసిడెంట్స్ (బ్రాడ్ స్పెషాలిటీ) -5 పోస్టులు.