వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ఇదే..

ముంబ‌యి: ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ కోసం టీమిండియాను ప్ర‌క‌టించింది బీసీసీఐ. సూర్య‌కుమార్ యాద‌వ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ల‌కు తొలిసారి వ‌న్డే టీమ్‌లో చోటు ద‌క్కింది. ఆడిన తొలి టీ20 ఇన్నింగ్స్‌లోనే హాఫ్ సెంచ‌రీతో మెరిసిన సూర్య‌కుమార్ ఇక వ‌న్డేల్లోనూ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడు. పేస్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ వ‌న్డే టీమ్‌లోకి తిరిగొచ్చాడు. ష‌మి, ర‌వీంద్ర జ‌డేజా ఇంకా గాయాల నుంచి కోలుకుంటుండ‌టంతో వాళ్ల పేర్ల‌ను ప‌రిశీలించ‌లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీం ఇండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. 18 మందితో కూడిన ఈ జట్టులో గత ఆసీస్‌ పర్యటనలో పాల్గొన్నవారే ఎక్కువగా ఉండటం గమనార్హం. నటరాజన్, హైదరాబాద్‌ ఆటగాడు సిరాజ్‌, కృనాల్‌ పాండ్యా, కులదీప్‌ యాదవ్‌, ప్రసిద్ కృష్ణ, శుభమన్‌ గిల్‌ లాంటి ఆటగాళ్లు జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఇక ఇంగ్లాండ్‌తో ఈ నెల 23 నుంచి వన్డే మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. పూణే వేదికగా ఈ వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 23, 26, 28 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.

టీమిండియా: విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ‌, ధావ‌న్‌, శుభ్‌మ‌న్ గిల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, సూర్యకుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా, రిష‌బ్ పంత్‌, కేఎల్ రాహుల్‌, చాహ‌ల్‌, కుల్‌దీప్‌, కృనాల్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, న‌ట‌రాజ‌న్‌, భువ‌నేశ్వ‌ర్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ధ్ కృష్ణ‌, శార్దూల్ ఠాకూర్

Leave A Reply

Your email address will not be published.