త‌గ్గిన బంగారం, వెండి ధరలు

హైద‌రాబాద్‌: ఈ మ‌ధ్య కాలంలో బంగారం ధ‌ర‌ల్లో హెచ్చుత‌గ్గులు న‌మోద‌వుతూనే ఉన్నాయి. గ‌త గత మూడు రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధ‌ర తాజాగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పైకి కదలడంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది.

ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గి రూ. 45,930 కు చేరింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 42,100 కు చేరింది.
ఇక ఈరోజు వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనించింది. కిలో వెండి ధర రూ. 1000 తగ్గి రూ. 71,500 కు చేరుకుంది.

Leave A Reply

Your email address will not be published.