తెలంగాణలో కొత్తగా 364 కొవిడ్ కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 364 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. వీటిలో 2,98,451 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 2,607 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 1666 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు.