వ‌రుస‌గా 3 నెల‌లు రేష‌న్ తీసుకోక‌పోతే కార్డు ర‌ద్దు..

హైద‌రాబాద్: ఆహార భ‌ద్ర‌తా కార్డుల జారీ నిరంత‌ర ప్ర‌క్రియ అని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా బిపిఎల్ కుటుంబాల‌కు తెల్ల రేష‌న్ కార్డుల జారీపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి సమాధానం ఇచ్చారు. తెల్ల రేష‌న్ కార్డుల కోసం 9,41,641 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయ‌ని, ఇందులో 3,59,974 మందికి ఆహార భ‌ద్ర‌తా కార్డులు జారీ చేశామ‌న్నారు. 92 వేల ద‌ర‌ఖాస్తులను తిర‌స్క‌రించామ‌ని, 4,88,775 కార్డుల ద‌ర‌ఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయ‌ని తెలిపారు.

కొత్త రేష‌న్ కార్డులు ఇచ్చే అంశం ప్ర‌భుత్వ ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు. 97 వేల కార్డులు పెండింగ్‌లో ఉన్నాయ‌న్నారు. క‌రోనా కార‌ణంగానే కొత్త కార్డుల‌ను జారీ చేయ‌లేక‌పోయామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. పెండింగ్ ద‌ర‌ఖాస్తుల‌ను త్వ‌ర‌లోనే వెరిఫై చేసి ప్ర‌తి ఒక్క అర్హుడికి తెల్ల రేష‌న్ కార్డుల‌ను జారీ చేస్తామ‌న్నారు. 3 నెల‌లు వ‌రుస‌గా రేష‌న్ బియ్యం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా రేష‌న్ కార్డు ర‌ద్దు అవుతుంద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.