బెల్లంపల్లి పాలిటెక్నిక్‌లో 20 మందికి కరోనా
బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కరోనా కలకలం రేగింది. కళాశాలలో 12 మంది సిబ్బందికి, 8 మంది విద్యార్థులకు కరోనా సోకింది. మంగళవారం కళాశాలలోని 146 విద్యార్థులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 20 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో విద్యార్థుల కుటుంబీకులు, తీవ్ర ఆందోళనకు గురువుతున్నారు. కరోనా సోకిన వారిని హోం ఐసోలేషన్‌కు తరలించనున్నట్లు స్థానిక వైద్యాధికారి తెలిపారు. కాగా ఈ మధ్య కాలంలో మంచిర్యాలలోని బాలిక ఉన్నత పాఠశాలలో భారీగా కరోనా కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజాగా పాలిటెక్నికల్ కళాశాలలో కేసులు నిర్ధారణ కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.