ఎపిలో కొత్తగా 492 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 492 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. అలాగే గడిచిన 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 7193 మంది మృతిచెందారు. అదే సమయంలో 256 మంది రికవరీ అయ్యారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,94,536 కి చేరింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 8,84,727 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2616 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
