వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

బ‌ద్వేలు: కడప జిల్లా బద్వేలు నియోజక వర్గ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో చికిత్స పొంది క‌డ‌ప‌లోని త‌న నివాసానికి చేరుకున్నారు. ఆ త‌ర్వాత ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొని ప్రచారం నిర్వహించిన తరువాత తిరిగి అనారోగ్యం పాలవ్వడంతో కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఈయ‌న‌కు భార్య‌, ఇంట‌ర్ చ‌దువుతున్న కుమారుడు, ఎంబిబిఎస్ నాలుగో ఏడాది చ‌దువుతున్న కుమార్తె ఉన్నారు. బద్వేలు వైకాపా ఎమ్మెల్యే మరణం పట్ల పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే స్వ‌స్థ‌లం బ‌ద్వేలు పుర‌పాల‌క‌లోని మ‌ల్లెల‌వారిప‌ల్లి.

Leave A Reply

Your email address will not be published.