నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి

బుచ్చిరెడ్డిపాలెం: నెల్లూరు జిల్లాలో ఆదివారం తెల్ల‌వారు జామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండ‌లం దామ‌ర‌మ‌డుగు వ‌ద్ద లారీని టెంపో వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ప్ర‌యాణిస్తున్న ఏడుగురు అక్క‌డికక్క‌డే మృతిచెంద‌గా, మ‌రొక‌రు ఆసుప‌త్రికి తర‌లిస్తుండ‌గా మృతిచెందారు. మృతులు త‌మిళ‌నాడు వాసులుగా గుర్తించారు. వీరంతా కర్నూలు జిల్లాలోని శ్రీశైలం నుంచి నెల్లూరు జిల్లాకు వస్తుండగా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఆగివున్న లారీని బాధితులు ప్రయాణిస్తున్న టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.