ఎంపిలో నాలుగు జిల్లాల్లో లాక్ డౌన్

క‌రోనా కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర స‌ర్కార్ రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సూచించింది. ఈ క్ర‌మంలో మధ్యప్రదేశ్ లో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ లోని ఛింద్వారా, రట్లం, ఖార్గోన్, భేతుల్ జిల్లాల్లో లాక్ డౌన్ విధించింది. ఆయా జిల్లాల్లోని పలు పట్టణ, మండల ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కాగా దేశంలోని 11 రాష్ట్రాల్లో తీవ్రత అధికంగా ఉన్నట్టు కేంద్రం అంచనా వేసింది. శుక్ర‌వారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి అన్ని రాష్ట్రాల సీఎస్ లతో సమావేశం నిర్వహించారు. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.