రైల్వే అండ‌ర్ బ్రిడ్జిని ప్రారంభించిన కెటిఆర్‌

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రాన్ని సిగ్న‌ల్ ఫ్రీ ర‌హ‌దారుల న‌గ‌రంగా మార్చేందుకు కెసిఆర్ స‌ర్కార్ మ‌రో అడుగు ముందుకేసింది. రూ. 66,59 కోట్ల వ్య‌వ‌హ‌యంతో పూర్త‌యిన హైటెక్ సిటీ రైల్వే అండ‌ర్ బ్రిడ్జి (ఆర్‌యుబి)ని పుర‌పాల‌క మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ అధికంగా ఉండే ఈ మార్గంలో 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. ఈ ఆర్‌యూబీ అందుబాటులోకి రావ‌డంతో కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్‌ చిక్కులు తప్పాయి. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధ‌వరం కృష్ణారావు, మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, డిప్యూటీ మేయ‌ర్ శ్రీల‌త రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.