ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్
కౌరి: కశ్మీర్‌ను మిగిలిన దేశంలో అనుసంధానించడంలో భాగంగా చేపట్టిన యూఎస్బీఆర్ఎల్ ప్రాజెక్ట్‌లో సోమవారం ఓ చారిత్రక మైలురాయిని నార్తర్న్ రైల్వేస్ పూర్తి చేసింది. ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వే బ్రిడ్జ్ సోమవారంతో కీలకమైన ఆర్క్ నిర్మాణం పూర్తి చేసుకుంది. జమ్ముకశ్మీర్‌లో చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు.

ఆర్క్ పూర్తవడం ఓ మైలురాయిగా నార్తర్న్ రైల్వేస్ అభివర్ణించింది. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడువు 1.3 కిలోమీటర్లు కాగా.. రూ.1486 కోట్ల ఖర్చుతో దీనిని నిర్మిస్తున్నారు. ఉధమ్‌పూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ అతి ఎత్తయిన బ్రిడ్జ్‌ను నిర్మించాలని నిర్ణయించారు. ఇది ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే కూడా 35 మీటర్ల ఎత్తు ఎక్కువ ఉండటం విశేషం. ప్రాజెక్ట్ మొత్తం రెండున్నరేళ్లలో పూర్తవుతుంది అని నార్తర్న్ రైల్వేస్ జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ తెలిపారు.

A moment of pride for 🇮🇳! The arch of Chenab bridge, connecting Kashmir to Kanyakumari has been completed.
With an arch span of 467m, it is the world’s highest railway bridge.
PM @NarendraModi ji’s vision to connect India has inspired the Railway family to scale new heights pic.twitter.com/GEDEBIb9nE
— Piyush Goyal (@PiyushGoyal) April 5, 2021