భారీగా పెరిగిన ధరలు

హైద‌రాబాద్‌: పసిడి ప్రియుల‌కు షాక్‌! మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరల్లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ వస్తున్న పసిడి ధర.. తాజాగా మళ్లీ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పైకి కదలడంతో బులియన్ మార్కెట్‌లోనూ దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పైకి ఎగసి రూ. 46,530 కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 42, 650 కు చేరింది. వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1200 పెరిగి రూ. 70, 500 వద్ద కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.