మహారాష్ట్ర టు నిజామాబాద్ రాకపోకల బంద్
నిజామాబాద్: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఈ క్రమంలో మహారాష్ట్రలో కేసులు సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి గ్రామ శివారులో ఏర్పాటుచేసిన అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద రాకపోకలను అధికారులు నిలిపి వేశారు. వంతెన వద్ద పొరుగు రాష్ట్రాల వాహనాలు రాకుండా రోడ్డుకు ఇరు వైపులా బరికేడ్లను ఏర్పాటు పోలీసులు ఏర్పాటు చేశారు.