వకీల్ సాబ్: తిరుపతిలోని థియేటర్ల వద్ద ఉద్రిక్తత
తిరుపతి: మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెరపై కనిపించనుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో థియేటర్లలో ఇవాళ రిలీజ్ అవుతున్న వకీల్‌సాబ్‌పై భారీ అంచనాలున్నాయి.
పవర్‌స్టార్ అభిమానుల కోసం శుక్రవారం బెనిఫిట్ షోలు ఏర్పాటు చేశారు. అయితే.. తిరుపతిలోని థియేటర్ల వద్ద ఉద్రిక్తత నెలకొంది. వకీల్ సాబ్ షోను సినిమా హాల్లు ప్రదర్శించలేదు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రదర్శించాల్సిన సాధారణ షోలను సైతం నిలిపివేయాలని థియేటర్ల యాజమాన్యానికి నోటీసులు జారీ అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల షోకు బుక్ చేసుకున్న టికెట్ల డబ్బులను థియేటర్ యాజమాన్యం తిరిగి ఇచ్చేస్తుంది. దీంతో ఆగ్రహం చెందిన ప్రేక్షకులు థియేటర్ పై రాళ్ళ దాడి చేశారు. ఈ ఘటనలో ఓ థియేటర్ అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.