తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2478 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,21,182కి చేరింది. ఇప్పటి వరకు 3,03,964 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 15,472 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా ఐదుగురు కరోనాతో మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1746కి చేరిందని అధికారులు పేర్కొన్నారు. కాగా జిహెచ్ ఎంసి పరిధిలో 402 కరోనా కేసులు నమోయ్యాయి.