TS LockDown: మ‌ద్యం షాపులు ఓపెన్ చేసుకోవ‌చ్చు!

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ‌లో లాక్‌డౌన్ నేప‌థ్యంలో మ‌ద్యం దుకాణాల విష‌యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉద‌యం 6 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు తెరుచుకునేందుకు వెల‌సులుబాటు క‌ల్పించింది. ఈ మేర‌కు ఆబ్కారీ శాఖ‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. అబ్కారీ శాఖ నిబంధ‌నల ప్ర‌కారం బార్ అండ్ రెస్టారెంట్లు మ‌ద్యం దుకాణాలు ఉద‌యం 10 గంట‌ల‌లోపు తెరిచే అవ‌కాశం లేదు. కాగా లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉద‌యం 10 గంట‌ల నుండే అమ‌లులోకి వ‌స్తాయి. ఈ నేప‌థ్యంలో అబ్కారీ శాఖ మ‌ద్యం దుకాణాలు తెరిచే విష‌యంపై స‌ర్కార్ నిర్ణ‌యం కోసం వేచి చూడ‌గా.. ప్ర‌భుత్వం నిబంధ‌న‌లను స‌డ‌లించింది.

ఈ క్ర‌మంలో ఈనెల 21 వ‌ర‌కు ఉద‌యం 6 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు 10 రోజుల పాటు మాత్ర‌మే ఈ కార్య‌క‌లాపాల‌కు స‌ర్కార్ అవ‌కాశ‌మిచ్చింది.

రాష్ర్ట ప్ర‌భుత్వం రేప‌ట్నుంచి ప‌ది రోజుల పాటు లాక్‌డౌన్‌ను విధించిన సంగ‌తి తెలిసిందే. రేపటి నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వైన్స్‌షాపులు అందుబాటులో ఉంటాయో.! లేదోనన్న సందేహంతో మందు బాబులు మ‌ద్యం దుకాణాల‌వైపు ప‌రుగులు పెట్టారు.

త‌ప్ప‌క చ‌ద‌వండి: LockDown: మద్యం దుకాణాల వద్ద మందుబాబుల రద్దీ!

Leave A Reply

Your email address will not be published.