దారుణం: గోవాలో మరో 8 మంది మృతి

గోవా (CLiC2NEWS): గోవాలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇక్క‌డ మ‌ర‌ణాల సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా గోవాలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్య‌మంగా గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా ఆక్సిజన్ కొరత ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. తాజాగా ఇక్కడ‌ 8 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు గోవా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మొత్తం 83 మంది క‌రోనా బాధితులు మృతి చెందారు. వారం రోజుల వ్యవధిలో భారీగా మరణాలు సంభవించడంతో అధికారులు ఈ ఆసుపత్రిపై దృష్టి సారించారు. శనివారం అర్థరాత్రి సమయంలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడం వలన మరణాలు సంభవించాయని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా న్యూమోనియా వలన రోగులు మృతి చెందారని వైద్యులు చెప్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.