బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీయం: సిఎం కెసిఆర్
బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి
హైదరాబాద్ (CLiC2NEWS): గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతి కోసం బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీయమన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానం.. వీటిలోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయని ముఖ్యమంత్రి అన్నారు. ఫణిగిరి వంటి బౌద్ధారామాల్లో బయల్పడుతున్న అరుదైన బౌద్ధ చారిత్రక సంపద.. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాలను అల్లుకొని తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని కెసిఆర్ తెలిపారు. ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడటమే భగవాన్ గౌతమ బుద్ధునికి నిజమైన నివాళి అని… తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆ దిశగా ముందుకు సాగుతోందని అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.