Cyclone Yaas: అల్లకల్లోలం సృష్టిస్తున్న యాస్ తుఫాన్..

న్యూఢిల్లీ (CLiC2NEWS): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను యాస్ బుధ‌వారం ఉద‌యం తీరాన్ని తాకింది. ఒడిశాలోని భ‌ద్ర‌క్ జిల్లాలోని ధామ్రా ఓడ‌రేవు స‌మీపంలో తీరం దాటే ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండి) వెల్ల‌డించింది. తీరాన్ని దాటే ప్ర‌క్రియ పూర్త‌వ‌డానికి కొన్ని గంటు ప‌ట్ట‌నుంద‌ని తెలిపింది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. దీంతో సముద్రం నీరు నివాసప్రాంతాల్లోకి వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ తూర్పు మిడ్నాపూర్ లోని న్యూ దిఘా బీచ్ వెంబడి సముద్రం నుంచి నీరు నివాస ప్రాంతాలలోకి ప్రవేశిస్తున్నాయి. రాకాసి అలలు పెద్ద ఎత్తున ఉగ్రరూపంతో దూసుకువస్తున్నాయి. అంతేకాకుండా ఒడిషా ప్రాంతాల్లో ఈదురు గాలులతో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావ‌ర‌ణ శాఖ సూచించింది. ఇప్పటికే తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్ తీర ప్రాంతాల నుంచి 9 ల‌క్ష‌ల మందిని, ఒడిశా నుంచి దాదాపు 3 ల‌క్ష‌ల మందిని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ పలు రాష్ట్రాల్లో అలర్ట్‌ను జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.